శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (11:19 IST)

ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయం.. రికార్డు సృష్టించిన టీమిండియా..

భారత్-ఆస్ట్రేలియాకు మధ్య అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అడిలైడ్ టెస్టులో భారత్‌ ఓడినా ఆస్ట్రేలియా ప్రపంచ సంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది.


అడిలైడ్ తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆటగాళ్లు 291 పరుగులకు భారత్‌ ఆలౌట్ చేయడంతో 31 పరుగుల తేడాతో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. ఇదే మ్యాచ్‌లో ప్రపంచ టెస్టు క్రికెట్‌ను ఆసీస్ నమోదు చేసుకుంది. 
 
ఆసీస్ ఆటగాళ్లు, ప్రతి వికెట్‌కూ కనీసం 15 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను గెలిపించేందుకు ప్రతి ఆటగాడూ తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ చివరికి టీమిండియాకే విజయం వరించింది. ఆసీస్ ఆటగాళ్లలో ఓపెనర్ ఫించ్ 11 పరుగులు, హారిస్ 26 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి దిగిన ఖావాజా8, మార్ష్ 60, హాండ్స్ కోంబ్ 14, హెడ్ 14, పైనీ 41, కుమిన్స్ 28, స్టార్క్ 28 పరుగులు చేశారు. 
 
చివరికి నాథన్ లియాన్ 38 పరుగులు సాధించాడు. బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కానీ అశ్విన్, హేజల్ వుడ్ వికెట్‌ను సాధించడంలో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. ఇక భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రా, షమీలకు తలో మూడు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 88 ఓవర్లలో 250 పరుగులు సాధించింది. భారత బ్యాటింగ్‌లో పుజారా (123) పరుగులతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ  దశలో ట్రావిస్ హెడ్ (72) నిలకడగా ఆడటంతో ఆసీస్ 235 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించాడు.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులు సాధించి ఆలైట్ కాగా.. 323 పరుగుల విజయ లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 104 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఐదో రోజు ఆట ప్రారంభంలోనే ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
 
భారత బౌలర్లు ధీటుగా రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 119.5 ఓవర్లలో ఆస్ట్రేలియా 291 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో భారత్ ఈ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ని 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. కాగా ఆసీస్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇండియా విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన టీమిండియాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.