బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (15:10 IST)

ధోనీనే నా ఫేవరెట్ హీరో... క్యాండిల్ లైట్ డిన్నర్‌తో పాటు: కైరా అద్వానీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకెంతో ఇష్టమని.. గతేడాది విడుదలైన బయోపిక్ ''ధోనీ: ద అన్‌ టోల్డ్‌ స్టోరీ'' సినిమాలో ధోనీ భార్య సాక్షి పాత్రలో కనిపించిన కైరా అద్వానీ ఒక క్రీడా ఛానెల్‌‌క

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకెంతో ఇష్టమని.. గతేడాది విడుదలైన బయోపిక్ ''ధోనీ: ద అన్‌ టోల్డ్‌ స్టోరీ'' సినిమాలో ధోనీ భార్య సాక్షి పాత్రలో కనిపించిన కైరా అద్వానీ ఒక క్రీడా ఛానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సందర్భంగా కైరా అద్వానీ.. తన అభిమాన క్రీడాకారుడు ధోనీ అని చెప్పుకొచ్చింది.

అవకాశం వస్తే ధోనీతో క్యాండిల్ లైట్ డిన్నర్‌కు వెళ్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అసలు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఏంటో తెలియదని.. మహీతో డిన్నర్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. 
 
ధోనీని హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్‌లో చూశానని తెలిపింది. తన కుటుంబీకుల పట్ల అతను బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చింది. అంతేకాదు జీవాను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని అందుకే ధోనీతో క్యాండిల్ లైట్ డిన్నర్‌కు అతనితో ఓకే అని కైరా తడుముకోకుండా చెప్పేసింది.

చూసేందుకు ధోనీ నార్మల్‌గా వుంటాడని.. అందుకే అతనంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ధోనీ తన ఫేవరేట్ హీరో అంటూ కైరా తేల్చేసింది. అతని తరువాత కోహ్లీ అంటే ఇష్టం, అతడు హాట్‌గా కనిపిస్తాడని నవ్వేసింది.