శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (16:40 IST)

ధోనీ కెరీర్ ముగిసినట్టేనా? బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో కనిపించని పేరు!

జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కెరీర్ ముగిసినట్టుగానే తెలుస్తోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో ధోనీ పేరు లేకపోవడంతో ఈ సందేహం ఉత్పన్నమవుతోంది. 
 
2019-2020 సంవత్సరానికిగానూ 27 మంది క్రికెటర్ల పేర్లతో కూడిన కాంట్రాక్టు జాబితాను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ఇందులో ధోనీ పేరు లేదు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటన త్వరలో వెలువడనుందన్న ప్రచారం జోరుగా జరుగున్న తరుణంలో వార్షిక జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
గత యేడాది ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయినంది. అప్పటి నుంచి ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేస్తాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై ధోనీ ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
అయితే ధోనీతో మాట్లాడిన తర్వాతే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని తెలుస్తోంది. రిటైర్ అవుతానని బీసీసీఐ పెద్దలకు ధోని చెప్పినట్లు సమాచారం. అందుకే బీసీసీఐ కాంట్రాక్టులో చోటు ఇవ్వలేదని చెబుతున్నారు.
 
కాగా, బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో ఏ ప్లస్ కాంట్రాక్టు విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాలు ఉండగా, గ్రేడ్-ఏలో అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, రాహుల్, ధవన్, షమి, ఇషాంత్, కుల్దీప్, పంత్‌ ఉన్నారు.
 
అలాగే, బి-గ్రేడ్‌లో సాహు, ఉమేశ్, చాహల్, పాండ్యా, మయాంక్‌... సీ గ్రేడ్‌లో జాదవ్, సైనీ, చాహర్, మనీశ్ పాండే, విహారీ, శ్రేయాస్, వాషింగ్టన్ సుందర్‌ ఉన్నారు.