శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (17:14 IST)

ఐపీఎల్‌ 2022: సీఎస్కే రీటైన్ ఆటగాళ్లలో ధోనీ.. కానీ జడేజా కంటే?

ఐపీఎల్‌ 2022 సీజన్‌ మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల వివరాలు లీక్ అయ్యాయి. స్వల్ప మార్పులు మినహా ఈ జాబితాలో పెద్దగా తేడాలేమి ఉండవని స్పష్టం చేసింది. 
 
కానీ చెన్నై సూపర్ కింగ్స్ నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుందని, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. 
 
అయితే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కన్నా జడేజాకే భారీ ధరను చెల్లించి మరీ చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంటుందని ఫ్రాంచైజీ వర్గాలు పేర్కొన్నాయి.
 
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. 
 
ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి.