మైనర్ బాలికపై రేప్ కేసు.. నేపాల్ యువ క్రికెటర్ సందీప్ అరెస్ట్
నేపాల్ యువ క్రికెటర్ సందీప్ లామిచానే రేప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 17ఏళ్ల మైనర్ బాలికపై సందీప్ లామిచానే అత్యాచారానికి పాల్పడినట్టు తీవ్ర అభియోగాలు నమోదైనాయి. ఈ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో సందీప్ లామిచానే ఇన్నాళ్లు విదేశాల్లో తలదాచుకున్నాడు.
ఇటీవలే అతడిపై ఇంటర్ పోల్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దాంతో అజ్ఞాతాన్ని వీడిన సందీప్ లామిచానే నేడు స్వదేశానికి తిరిగొచ్చాడు. అతడు ఖాట్మండు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే, నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అంతకుముందు, సందీప్ లామిచానే సోషల్ మీడియాలో స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన విచారణలో సంపూర్ణంగా సహకరిస్తానని వెల్లడించాడు. తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తానని తెలిపాడు.