గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (14:26 IST)

ట్రోల్స్ ఎదుర్కొంటున్న చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ‌.. కారణం ఏంటి?

Dhanashree Verma
Dhanashree Verma
టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ‌ ప్రస్తుతం ట్రోల్స్ ఎదుర్కొంటోంది. కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌తో ధనశ్రీ ఫోటో ఈ ట్రోల్స్‌కు కారణమైంది. పెళ్లయిన ఆమెకు మరొకరితో అంత సాన్నిహిత్యం ఎందుకు? అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ధన్మశ్రీ వర్మ ఎప్పటికైనా చాహల్‌కు అన్యాయం చేస్తుందని దారుణమైన కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధన శ్రీ వర్మకు సీక్రెట్ ఎఫైర్ ఉందనే ప్రచారం ఉంది.

చాహల్ లేకుండా శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధనశ్రీ వర్మ పలు కార్యక్రమాలకు హాజరైంది. తాజాగా ప్రతీక్ ఉతేకర్‌తో సన్నిహితంగా వున్న ఫోటో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అయితే ఈ ట్రోల్స్‌ను చాహల్ పట్టించుకోవట్లేదు. 
 
మరోవైపు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్‌ భారత రెజ్లర్ సంగీత ఫోగట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చాహల్‌ను అమాంతం తన భుజాలపై ఎత్తుకొని గిర్ర గిర్ర తిప్పింది. వదిలేయాలని చాహల్‌ ఎంత వేడుకున్నా.. ఆమె వినిపించుకోలేదు. 
 
కాసేపు తిప్పిన తర్వాత చాహల్‌ను కిందికి దించడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.