మంగళవారం, 14 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జనవరి 2025 (13:31 IST)

మోకాళ్లతో తిరుమల మెట్లెక్కిన క్రికెట్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డి

Nitish Kumar Reddy
Nitish Kumar Reddy
తెలుగు స్టార్ నితీష్ కుమార్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున తిరుమల ఆలయాన్ని సందర్శించారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి వేంకటేశ్వర అనుగ్రహం కోసం నితీష్ కాలినడకన తీర్థయాత్ర చేసి, మోకాళ్లపై ఆలయ మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
కాగా గత సంవత్సరం, నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించాడు. ఇది భారత క్రికెట్ జట్టులో అతనికి స్థానం సంపాదించి పెట్టింది.

టి-20 మ్యాచ్‌లలో రాణించే యువ తెలుగు క్రికెటర్ తరువాత భారతదేశం ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో నితీష్ భారతదేశానికి రెండవ అత్యధిక రన్-స్కోరర్‌గా అవతరించాడు. ఐదు వికెట్లు సాధించి తన ప్రతిభను చాటాడు.