శుక్రవారం, 1 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (22:51 IST)

రంజీ ట్రోఫీ: ముంబై జట్టులో అర్జున్.. కేరళ జట్టులో శ్రీశాంత్

రంజీ ట్రోఫీ జట్టును ప్రకటించారు. ముంబై జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అర్జున్‌ టెండూల్కర్‌కు కూడా ముంబై జట్టులో చోటు లభించింది.
 
గత ఏడాది ముస్తాక్‌ అలీ టోర్నీలో ముంబై తరఫున రెండు టి20 మ్యాచ్‌‌లు ఆడిన 22 ఏళ్ల అర్జున్‌ను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌ తీసుకున్నా, మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. 
 
జనవరి 13 నుంచి జరిగే తమ తొలి పోరులో మహారాష్ట్రతో ముంబై తలపడుతుంది. ఐపీఎల్ చివరి సీజన్ కోసం అర్జున్ ముంబై ఇండియన్స్ జట్టులో కూడా భాగమయ్యాడు. కానీ, ఒక్క మ్యాచ్‌లోనూ అతనికి అవకాశం రాలేదు.
 
41 సార్లు రంజీ టైటిల్ గెలిచిన ముంబై జట్టు, గ్రూప్ -సిలో 9 జట్లతో మ్యాచులు ఆడుతుంది. మరోవైపు, ఉత్తరప్రదేశ్ టీమ్‌ని రంజీ ట్రోఫీలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నడిపించబోతున్నాడు.   
 
కేరళ జట్టుకు కెప్టెన్ గా సచిన్ బేబీ ఎంపికయ్యాడు. విష్ణు వినోద్‌కి వైస్ కెప్టెన్సీ దక్కింది. సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో కేరళను నడిపించిన సంజూ శాంసన్‌, రంజీ ట్రోఫీలో ఆడుతున్నా, కెప్టెన్సీ చేయడం లేదు. 
 
ఇక, భారత మాజీ పేసర్ శ్రీశాంత్, 9 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రంజీ ట్రోఫీ 2021-22 టోర్నీకి ప్రకటించిన 24 మందిలో శ్రీశాంత్‌కి చోటు దక్కింది.