ఆప్ఘనిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో కెప్టెన్ అవుట్?
బంగ్లాదేశ్-ఆప్ఘనిస్థాన్-జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఫైనల్‌కు చేరిన ఆఫ్ఘనిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్‌తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
కానీ ఈ మ్యాచ్ నుంచి ఆప్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. రషీద్‌ఖాన్ గాయంపై జట్టు యాజమాన్యం ఆందోళనకు గురవుతోంది. ఫైనల్ మ్యాచ్ వరకు అతడికి గాయం తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం.
బంగ్లాదేశ్‌తో గత శనివారం (సెప్టెంబర్ 21) జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ గాయపడ్డాడు. ఇప్పటికే ఫైనల్‌కు ఆప్ఘనిస్థాన్ అర్హత సాధించడంతో ఆందోళన లేదు.
రషీద్‌కు అయిన గాయంపై ఆఫ్ఘాన్ జట్టు మేనేజర్ నజీం జర్ అబ్దుర్ రహీం జై ఆదివారం మాట్లాడుతూ... 'ఫైనల్‌కు మరో రెండు రోజుల సమయం ఉంది. అతడు ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నాడు.