ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (12:18 IST)

రిషబ్ పంత్ కారు ప్రమాదం ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో..!

Rishab pant
Rishab pant
రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్ సమీపంలోని రూర్కీ ప్రాంతంలో రిషబ్ పంత్ కారులో వెళ్తుండగా బారికేడ్ ను ఢీకొనడంతో అతని కారు అగ్నికి ఆహుతైంది. ఈ కారును రిషబ్ పంత్ నడిపినట్లు సమాచారం. 
 
రిషబ్ పంత్, అతనితో కారులో ప్రయాణించిన వ్యక్తులు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం రిషబ్ పంత్  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రిషబ్ పంత్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని వార్తలు వస్తున్నాయి.
 
రిషబ్ పంత్ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిషబ్ పంత్ కారు అగ్నికి ఆహుతైన సమయంలో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు కాపాడారు.