శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (12:12 IST)

డేవిడ్ వార్నర్ ట్రిబుల్ సెంచరీ.. కొత్త రికార్డు

ఆస్ట్రేలియా- పాకిస్థాన్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ట్రిబుల్ సెంచరీ సాధించిన డేవిడ్ వార్నర్ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభం నుంచే అద్భుతంగా రాణించింది. 
 
తొలి రోజు ఆటలో ఒక వికెట్ నష్టానికి 302 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా రెండో రోజు 500 పరుగులతో 600 పైచిలుకు దిశగా రాణిస్తోంది. ఆసీస్ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ రెండు రోజు వికెట్ కోల్పోకుండా 300 పరుగులు సాధించి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
 
గత 2015వ సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 253 పరుగులు సాధించిన డేవిడ్ వార్నర్ అత్యధిక పరుగులు సాధించాడు. ఈ రికార్డును ప్రస్తుతం డేవిడ్ వార్నరే అధిగమించాడు. ఇలా తన పేరిట వున్న రికార్డును తానే బ్రేక్ చేసిన ఆసీస్ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.