బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (12:45 IST)

ఇంగ్లండ్ ఫ్యాన్స్ క్లబ్ ఓవరాక్షన్.. (video)

ఆస్ట్రేలియా క్రికెటర్లు అదో టైపంటే.. ట్రోలింగ్ చేయడంలో ఇంగ్లండ్ ఫ్యాన్స్ ముందు వరుసలో వుంటారు. ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లుంటే గ్రౌండ్‌లో సందడి చేసే ఆ దేశ పాపులర్ క్రికెట్ ఫ్యాన్ క్లబ్ బార్మీ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.


ఈ  క్లబ్ ఎప్పటికప్పుడు ప్రత్యర్థి జట్లను తమ కామెంట్స్‌తో చికాకుపెడుతూ మానసికంగా దెబ్బతీస్తుంటుంది. ప్రస్తుతం ఈ క్లబ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, త్వరలో 2019 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. 
 
ఇలాంటి తరుణంలో ఇంగ్లండ్ ఫ్యాన్స్ క్లబ్ ఆస్ట్రేలియాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేందుకు సిద్ధమైంది.

ముఖ్యంగా.. బార్మీ ఆర్మీ కీలక ఆటగాళ్ల గతాన్ని గుర్తుచేస్తూ ట్విట్టర్‌లో మాటల యుద్ధానికి తెరలేపింది. మార్ఫింగ్‌ ఫొటోలతో ట్రోలింగ్‌ స్టార్ట్‌ చేసింది. 
 
ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్‌ వార్నర్‌ వేసుకున్న జెర్సీపై ఆస్ట్రేలియాకు బదులుగా 'చీట్స్‌' అని మార్ఫింగ్‌ చేసిన 'బార్మీ ఆర్మీ'..  బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన బెన్‌క్రాఫ్ట్‌ను గుర్తు చేస్తూ... కీలక బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌ చేతుల్లో సాండ్‌ పేపర్‌ పట్టుకున్నట్టు ఫొటోలను క్రియేట్‌ చేసి ఫ్యాన్‌ పేజీలో పోస్ట్‌ చేసింది.
 
అంతటితో ఆగకుండా ఆస్ట్రేలియా కొత్త జెర్సీ ఇదేనని ట్యాగ్ చేసింది. అయితే ఇలాంటి విమర్శలు, ట్రోలింగ్‌లను లైట్‌గా తీసుకుంటామని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ లాంగర్ తీసిపారేశారు.