సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (22:21 IST)

రోహిత్ శర్మకే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు

శ్రీలంకతో జరగనున్న మూడు టీ20లు, రెండు టెస్ట్‌ సిరీస్‌లకు సంబంధించిన భారత జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన రెండు వేర్వేరు జట్ల వివరాలను చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది. 
 
అందరూ ఊహించినట్లుగానే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో అతనికి డిప్యూటిగా జస్‌ప్రీత్ బుమ్రాను నియమించింది. 
 
సౌతాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలతో పాటు సీనియర్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహాలపై వేటు వేసింది.