శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (09:13 IST)

లక్నో వన్డే మ్యాచ్ : 9 పరుగులతో సౌతాఫ్రికా విజయం

team india
లక్నో వేదికగా పర్యాటక సౌతాఫ్రితాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ చేసిన ఒంటరిపోరాటం వృథా అయింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత జట్టు ఓపెనర్లు విఫలం కావడంతో పాటు సౌతాఫ్రికా బౌలర్ ఎంగిడి మూడు వికెట్లు తీసి భారత వెన్ను విరిచాడు.
 
మూడు వన్డే మ్యాచ్‌లో సిరీస్‌లో తొలి మ్యాచ్ లక్నో వేదికగా జరిగింది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదిరించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 40 ఓవర్లలో 250 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 
 
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఒంటరిపోరాటం చేశాడు. మొత్తం 63 బంతుల్లో 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లోని ఆటగాళ్లు సరైన మద్దతు ఇవ్వలేక పోవడంతో అతని ఒంటరిపోరాటం వృథా అయింది. ఆఖరి ఓవర్‌లో 30 పరుగులు చేయాల్సి వచ్చింది. స్పిన్నర్ షంసీ ఓవర్ వేయగా, ఓ సిక్సర్, మూడు ఫోర్లు బాదాడు. అప్పటికీ భారత్ విజయానికి 10 పరుగుల దూరంలో ఆగిపోయింది. 
 
భారత జట్టులో శ్రేయాస్ 50, శార్దూల్ ఠాకూర్ 33, ధావన్ 4, గిల్ 3, రుతురాజ్ 19, కిషన్ 20 చొప్పున పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లల లుంగీ ఎండిగి 3, రబాడా 2, పార్నెల్, మహరాజ్, షంసీలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టు 1-0 తేడాతో ఆధిక్యత సాధించింది.