బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (13:53 IST)

టెస్ట్‌ క్రికెట్‌కు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెస్సి బైబై

Faf du Plessis
టెస్ట్‌ క్రికెట్‌కు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డుప్లెస్సి రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల నుంచి రిటైరైన తర్వాత తాను టీ20లపై దృష్టి సారించనున్నట్లు డుప్లెస్సి చెప్పాడు. ఈ ఏడాది ఇండియాలో, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. ఈ ఫార్మాట్లో ప్రపంచంలో జరిగే అన్ని లీగ్‌లలో ఆడుతూ.. వరల్డ్‌కప్‌కు సిద్ధం కావాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. 
 
సౌతాఫ్రికా తరఫున 69 టెస్టులు ఆడిన డుప్లెస్సి 4,163 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెరీర్‌లో అతని అత్యధిక స్కోరు 199. గతేడాది డిసెంబర్‌లో శ్రీలంకపై ఈ స్కోరు సాధించాడు. సౌతాప్రికా టీమ్‌ను 36 టెస్టుల్లో లీడ్ చేసిన డుప్లెస్సి 18 మ్యాచ్‌లలో గెలిపించాడు. వన్డేల్లోనూ తాను ఆడతానని చెప్పిన డుప్లెస్సి.. టీ20లే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు.
 
2019లో వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా టీమ్ కెప్టెన్‌గా ఉన్న డుప్లెస్సి.. ఆ టోర్నీలో టీమ్ విఫలమవడంతో తొలగించారు. ఆ తర్వాత 2020, ఫిబ్రవరిలో టెస్ట్‌, టీ20 టీమ్‌లకు కూడా కెప్టెన్‌గా తప్పుకున్నాడు. 36 ఏళ్లు డుప్లెస్సి సౌతాఫ్రికా తరఫున 69 టెస్టుల్లో సౌతాప్రికా టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని తన మనసు చెబుతోందని ఇన్‌స్టాగ్రామ్‌లో డుప్లెస్సి చెప్పాడు. 
 
2012, నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో తొలి టెస్ట్ ఆడిన డుప్లెస్సి.. తన చివరి టెస్టును ఈ మధ్యే రావల్పిండిలో పాకిస్థాన్‌పై ఆడాడు. అయితే ఈ సిరీస్‌లో అతను మొత్తం విఫలమయ్యాడు. 10, 23, 17, 5 స్కోర్లు మాత్రమే చేశాడు.