శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (09:23 IST)

ఆర్చర్ రాక్షస బంతి.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న స్టీవ్ స్మిత్

ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ రాక్షస బంతికి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 148 కిలోమీటర్ల వేగంతో ఆర్చర్ విసిరిన బౌన్సర్ అది నేరుగా ఎడమ వైపు చెవి పక్కన మెడ భాగాన్ని తాకింది. దీంతో స్టీవ్ స్మిత్ క్రీజ్‌లోనే కుప్పకూలిపోయి విలవిల్లాడాడు. 
 
ఈ ఘటన ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్‌ సిరీస్, రెండో టెస్టులో జరిగింది. స్టీవ్ స్మిత్ 80 పరుగులతో ధాటిగా ఆడుతున్న వేళ, ఆర్చర్ వేసిన బంతి, అతన్ని గాయపరచగా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ వైద్య బృందాలు అతడికి చికిత్సను అందించి, వెంటనే మైదానం నుంచి వెళ్లాలని సూచించడంతో అతను రిటైర్డ్‌ హర్ట్‌‌గా పెవీలియన్ చేరాడు.
 
ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్లీ క్రీజ్‌లోకి వచ్చి 12 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వోక్స్ బౌలింగ్‌‌లో స్మిత్ అవుట్ అయ్యాడు. కాగా, గాయపడిన తర్వాత ఆర్చర్ నవ్వుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
సాటి ఆటగాడిని గాయపరచడంతో పాటు అలా ఎలా నవ్వుతున్నావని పలువురు ఆర్చర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటి ప్రపంచకప్‌‌లో ఆర్చర్ బౌలింగ్‌లోనే ఆసీస్‌ ఆటగాడు అలెక్స్ కారీకి దవడ పగిలిన విషయం తెల్సిందే.