టీ20 వరల్డ్ కప్: నవంబర్ 14న ఫైనల్.. యూఏఈలో మ్యాచ్‌లు
టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీకి బీసీసీఐ సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.. కరోనా నేపథ్యంలో.. యూఏలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇస్తూనే.. మ్యాచ్‌ల తేదీలను ఐసీసీ ప్రకటిస్తారనే రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇవాళ టోర్నీ నిర్వహణ, వేదికలపై ప్రకటన చేసింది ఐసీసీ. కోవిడ్ నేపథ్యంలో.. మ్యాచ్‌ల నిర్వహణ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలకు మార్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది.
సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.. అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించనున్నారు. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చింది.
బీసీసీఐ ఆతిథ్యంలోనే టోర్నీ జరుగుతుంది. మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జయిదా స్టేడియం(అబుదాబి), ద షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.