బయో బబుల్ అతిక్రమణ.. శ్రీలంక క్రికెటర్లపై ఏడాది నిషేధం  
                                       
                  
                  				  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే వుంది. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడ్డారు. వీరిలో క్రికెటర్లు కూడా వున్నారు. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు.
				  											
																													
									  దీంతో ఆయా క్రికెట్ బోర్డులు అప్రమత్తం అయ్యాయి. తాజాగా బయో బబుల్ అతిక్రమించారని ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఏడాది పాటు నిషేదం విధించింది. 
				  
	 
	లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకపై ఏడాది నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వారు ఇంగ్లాండ్ పర్యటనలో బయో బబూల్ అతిక్రమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.