ఇన్‌స్టాగ్రాంలో పరిచయం, 8వ తరగతి బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారం
సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఇన్ స్టాగ్రాం ద్వారా ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు పరిచయమైన ఓ 23 ఏళ్ల యువకుడు ఆమెను మాయమాటలతో నమ్మించి వంచించాడు. ఆపై ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకున్నది.
పూర్తి వివరాలు చూస్తే... హైదరాబాద్ నారాయణగూడకు చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికకు ఇన్‌స్టాగ్రాం పేజీ వుంది. దీని ద్వారా ఆగాపురంకి చెందిన 23 ఏళ్ల బైకు మెకానిక్ షేక్ ఆర్బాస్ బాలికకు పరిచయమయ్యాడు. ఆ వేదిక ద్వారా ఆమెకి మాయమాటలు చెప్పి స్నేహం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాతో వచ్చేయమని చెప్పాడు. అది నమ్మిన బాలిక అతడితో వెళ్లింది. ఆమెను గుల్బార్గా తీసుకుని వెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసాడు.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.