బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 26 జూన్ 2024 (15:33 IST)

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

Rape
నల్లగొండలోని శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పట్ల ఎస్సై అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు సదరు మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఓ భూవివాదం పరిష్కారం కోసం శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఐతే మహిళను చూసిన పోలీసు స్టేషను ఎస్సై తన ఛాంబరులోకి పిలిపించి రెండు గంటలపాటు అభ్యంతరకరంగా మాట్లాడుతూ వేధించాడు.
 
భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు అని ప్రశ్నిస్తూనే... నాకోసం చేపల కూర, చికెన్ కర్రీ, గ్రీన్ టీ పెట్టుకుని రావాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయి. నాతో సహకరిస్తే నీకు మేలు కలుగుతుంది. ఐనా భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు, అతనితో వుండాలని నీకు లేదా, నాతో మంచిగా వుంటే కేసు పరిష్కారం త్వరగా చేసేస్తా అంటూ అభ్యంతరకరంగా మాట్లాడరనీ, అతను చెప్పినట్లు చేయకపోవడంతో కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని గొడవలు సృష్టించినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.