శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (12:51 IST)

మహిళలపై పగ... నిద్రిస్తున్న మహిళలపై తలపై కొట్టి పారిపోయే కిరాతకుడు...

crime
చిన్నారులపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకెళ్ళడంతో ఆ యువకుడికి మహిళలపై పగ పెంచుకున్నాడు. మహిళలను చూస్తే కోపం కట్టలు తెంచుకునేది. అతని కోపం చల్లారకపోవడంతో రాత్రిపూట నిద్రించే మహిళలను గుర్తించి, వారిని తలపై బలంగా కొట్టి పారిపోయే ఓ కిరాతక యువకుడుని పోలీసులు అరెస్టు చేశారు. పేరు అజయ్ నిషాద్. వయసు 31 యేళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌ వాసి. తాను చేసే కిరాతక పనుల తర్వాత తన ప్రియురాలికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. అయితే, పోలీసులకు ఫిర్యాదులు చేసే బాధితుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో అజయ్ నిషాద్‌ను అరెస్టు చేశారు. 
 
నిందితుడు అజయ్ మొత్తం ఐదుగురు మహిళలపై ఈ తరహా దాడులకు పాల్పడినట్టు తేలింది. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ప్రతి సందర్భంలోనూ తన ప్రియురాలికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. గత 2022లో పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుశిక్ష విధించారు. అప్పటి నుంచి మహిళలపై పగ పెంచుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
ఇదే అంశంపై ఎస్ఎస్పీ గ్రోవర్ స్పందిస్తూ, అజయ్ నిషాద్ ఎపుడూ నల్లని దుస్తులు ధరించి, చెప్పులు లేకుండా ఉంటాడు. ఇళ్ళలోకి చొరబడి కర్రలు లేదా రాడ్లతో మహిళల తలలపై దాడి చేస్తాడు. జైలులో ఉన్న సమయంలోమహిళా ఖైదీల తలపైకొట్టడాన్ని ఇష్టపడేవాడు. ఆ అలవాటునే దాడులకు ఉపయోగించాడు' అని వివరించారు. గత జూలై 30వ తేదీ కూడా ఓ మహిళ తలపై దాడి చేశారని చెప్పారు.