పెళ్లి చేసుకోబోతున్న మరిది ప్రైవేట్ పార్టును కత్తిరించిన వొదిన, ఎందుకు?
మరిది పెళ్లి కొన్ని రోజుల్లో జరుగబోతోంది. పెళ్లి చేసుకునేందుకు సదరు మరిది ఇంటికి వచ్చాడు. పెళ్లి పనుల్లో ఎవరి హడావుడిలో వారున్నారు. ఇంతలో పెళ్లి చేసుకోబోతున్న మరిదిని అతడి వొదిన పిలిచింది. అతడిని గదిలోకి తీసుకుని వెళ్లి కత్తితో అతడి ప్రైవేట్ పార్టును కత్తిరించేసింది. ఈ దారుణానికి ఆమె ఎందుకు పాల్పడింది?
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఆగ్రాకు చెందిన యోగేష్ అనే యువకుడు ఉత్తరాఖండ్ ప్రాంతంలోని ఓ సిమెంట్ కంపెనీలో ఉద్యోగిగా వున్నాడు. నవంబరు నెలలో అతడికి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. దాంతో అతడు సెలవు పెట్టి వచ్చాడు. ఐతే అతడి వొదిన మాత్రం మరిది వివాహం చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహంతో వుంది.
మరిదిని గదిలోకి తీసుకెళ్లి అతడి ప్రైవేట్ పార్టును కట్ చేసేసింది. తన సోదరిని ప్రేమించి మరో యువతి మెడలో ఎలా తాళి కడతావురా అంటూ అతడిపై విరుచుకపడింది. తన సోదరిని మోసగించినందుకు నీకు ఇదే శాస్తి అంటూ అతడి ప్రైవేట్ పార్టును కత్తిరించేసింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఎయిమ్స్ కి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా వున్నట్లు తెలుస్తోంది.