శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , సోమవారం, 8 నవంబరు 2021 (10:46 IST)

ఏఆర్ కానిస్టేబుల్ ప్ర‌శాంతి అనుమానాస్ప‌ద మృతి... ఆ ఇద్ద‌రు యువ‌కులూ...

ఒక లేడీ కానిస్టేబుల్‌కు కూడా వేధింపులు త‌ప్ప‌లేదు. ఇద్ద‌రు యువ‌కుల నిర్వాకంతోనే ఆమె మృతి చెందిందని గ్రామ‌స్తులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఉద్రిక్తత నెల‌కొంది.
 
 
మచిలీపట్నంలో ఇటీవల ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జిల్లేపల్లి ప్రశాంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యపై తల్లిదండ్రులు, సోమ‌వ‌రం గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రశాంతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
 
జిల్లేపల్లి ప్రశాంతిని హత్య చేసి, వారే పక్కా ప్రణాళికతో ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించడానికి వ‌చ్చార‌ని సోమవరం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆమె బంధువులు,  గ్రామస్తులు ఆ యువకులు ఇద్దరిని గృహ నిర్బంధం చేశారు. దీనితో పోలీసులు వ‌చ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. ఎఆర్ కానిస్టేబుల్ ప్ర‌శాంతి మృతిపై విచార‌ణ చేస్తున్నారు.