మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (10:22 IST)

మహారాష్ట్రలో దారుణం.. ప్రియుడిని కట్టేసి.. ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

rape demo
ముంబై నగర శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రియుడుని కట్టేసి, ప్రియురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై మహానగర శివారు ప్రాంతమైన విహార్‌లోని సాయినాథ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ జంట బుధవారం ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కొండపైకి వెళ్లారు. అక్కడ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడంతో చీకటిపడిన విషయాన్ని కూడా వారు మరిచిపోయారు. 
 
ఆ సమయంలో ఇద్దరు దుండగులు వారిద్దరిపై దాడి చేశారు. యువకుడి కాళ్లు చేతులు కట్టేశారు. ఆ యువతిని బెదిరించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారిబారి నుంచి తప్పించుకున్న బాధితులు కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఈ ఘటనపై తక్షణం స్పందించిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.