సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (13:56 IST)

ఆటో డ్రైవర్‌తో రిలేషన్... భర్తతో కలిసిన భార్య.. జీర్ణించుకోలేక ఆటో డ్రైవర్ యాసిడ్ దాడి...

victim woman
తనతో రిలేషన్‌లో ఉన్న ఓ వివాహిత... తనను కాదని తిరిగి భర్త చెంతకు చేరింది. దీన్ని జీర్ణించుకోలేని ఆటో డ్రైవర్ ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన విశాఖపట్టణంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందువాని పాళెంకు చెందిన కె.శిరీష ఓ బ్యూటీషియన్. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింగరావుతో ఆమెకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
ఈ క్రమంలో ఇటీవల శిరీష తన భర్త చెంతకు చేరింది. ఇపుడు తన భర్తతో కలిసివుంటున్నానని, అందువల్ల ఇకపై తన వద్దకు రావొద్దని ఆటో డ్రైవర్‌కు చెప్పింది. నిన్నటివరకు తనతో కలిసివున్న శిరీష.. మళ్లీ తన భర్త చెంతకు చేరడాన్ని ఆటో డ్రైవర్ జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆమెపై యాసిడ్‌తో దాడి చేశారు. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ తీవ్రత తక్కువ కావడంతో పెను ప్రమాదం తప్పినా ముఖంపై రాషెస్ వచ్చాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.