1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By chitra
Last Updated : బుధవారం, 6 జనవరి 2016 (14:45 IST)

మహిళల చెవులకు మరింత అందాన్ని చేకూర్చే ఇయర్ కఫ్స్

అలంకరణ విషయంలో ఆడవారికి సాటి ఎవరు లేరు. వేడుకలు, పండుగల వంటివి వస్తే చాలు ఆడవాళ్లు అలంకరణకు ఇచ్చినంత ప్రాధాన్యం మరేదానికి ఇవ్వరు. కట్టుకునే చీర మొదలు నగలు, గాజులు ఇలా అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలని ఎన్నుకుని మరీ కొనుక్కుంటారు. చెవులకు రింగులు, లోలాకులకు తోడుగా మాటీలు, ధరించడం సాధారణమే. ఆడవారి నగల్లో ఆధునికతకు తగినట్లు ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 

మారుతున్న ట్రెండ్స్‌కు తగినట్లు నూతన డిజైన్లు, ఎన్నెన్నో మోడల్స్ వస్తూనే ఉన్నాయి. అలాంటివే ఈ ఇయర్‌కఫ్స్. మార్కేట్‌లో రకరకాల ఇయర్‌కఫ్స్ వెల్లువెత్తుతున్నాయి. విభిన్న రకాల హ్యాంగింగ్స్, చెవిని పూర్తిగా కవర్ చేసేసి, సగం వరకూ లేదా టాప్‌ను మాత్రమే లేదా అంచుల్ని, అదీ కాకుంటే చెవిని పూర్తిగా కవర్ చేసే ఈ కఫ్స్‌కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ వచ్చింది. సిల్వర్‌తో పాటు విభిన్న రకాల మెటల్స్‌తో ఇవి రూపొందిస్తున్నారు. 
 
టెంపుల్ జుయలరీలా ఉండి చెవి మొత్తాన్ని కప్పేసినట్లుండే ఈ ఇయర్ కఫ్‌లు కొత్త ట్రెండ్‌గా మార్కెట్లో దిగాయి. రంగురంగుల రాళ్లు, పూసలు, బంగారు, వెండితో తయారవుతున్నాయి. కొత్త ఫ్యాషన్ కోరుకునే ప్రియులకు పక్షులు, జంతువులు, బల్లులు, డ్రాగన్స్, పాములు, స్పైడర్ ఆకారాలతోనూ మార్కెట్లో లభ్యమవుతున్నాయి.