మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (13:51 IST)

పచ్చబొట్లు వేయించుకునేందుకు పనికిరాని శరీర భాగాలు ఏవి?

Tattoo
నేటి యువతీ యువకులు శరీరంపై తమకు నచ్చిన విధంగా టాటూస్ (పచ్చబొట్లు) వేయించుకుంటుంది. ఈ ట్రెండ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. తమకు ఇష్టమైన షేడ్స్‌లో శరీరంపై ఇంక్ చేయించుకోవడమే పచ్చబొట్టు వేయించుకోవడం అంటారు. అయితే, టాటూస్ వేయించుకునేటపుడు చాలా బాధతో పాటు నొప్పి కూడా కలుగుతుంది. 
 
కానీ, ఈ టాటూ వేయడానికి ముందు వ్యక్తి అభిరుచుని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, టాటూ కోసం శరీరంపై సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా ఉంటుంది. టాటూ వేసుకోవడం, బాడీ పియర్సింగ్ లేదా ఇతర కాస్మెటిక్ ట్రీట్‌మెంట్స్‌తో అనేక ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాస్మెటిక్ సర్జరీల వల్ల కలిగే నష్టాల మాదిరిగానే, పచ్చబొట్టు వేయించుకోవడం చాలా చేయవచ్చు
 
పచ్చబొట్టు వేయడానికి కొన్ని శరీరా భాగాలు పనికిరావు. అలాంటి ప్రదేశాల్లో టాటూస్ వేయడం వల్ల తీవ్ర హాని జరిగే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా, జననేంద్రియాలు, లోపలి పెదవులు వంటి చోట్ల వేయించుకోరాదు. అలాగే, అరచేతులు, పాదాల అడుగుభాగాలు, నాలుకపై అస్సలు వేయించుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శరీర భాగాలలో అలెర్జీ ప్రతిచర్యలు, మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది.