ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By సందీప్
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2019 (11:01 IST)

మొక్కల్ని ఇంట్లో పెంచకూడదు.. ఎందుకు..?

మొక్కలంటే చాలా మంది ఇష్టపడతారు. వాటిని ఇంట్లో నాటుకుంటారు. వాటి వలన మనకు ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే అన్ని మొక్కలనూ మనం ఇంట్లో పెంచుకోకూడదు. పెంచుకోకూడని మొక్కలు ఇంటి దగ్గర ఉంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది. చేయబోయే కార్యాలకు ఆటంకం కలుగుతుంది. శుభ కార్యాలు సిద్ధించవు. ఇంటి వద్ద మొక్కలను పెంచే దిశలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. 
 
జాగ్రత్త వహించకపోతే దారిద్ర్యం చుట్టుకుంటుంది. ఎలాంటి మొక్కలు ఇంటి దగ్గర పెంచకూడదు. అలాగే ఏ దిశల్లో చెట్లు ఉండకూడదో తెలుసుకోండి. ఫెంగ్ షుయ్ ప్రకారం కూడా కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. మరి అవి ఏమిటో చూడండి. కాక్టస్ లేదంటే దాని సంబంధిత మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకండి. అవి ఉంటే మీ ఇంట్లో దారిద్ర్యం పట్టిపీడుస్తుంది. 
 
గులాబి మొక్క కాక్టస్ జాతికి చెందినది అయినప్పటికీ దానిని మాత్రం ఉంచుకోవచ్చు. బోన్సాయ్ మొక్కలను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అది మంచిది కాదు. ఇంటి ముందర గార్డెన్‌లో లేదా ఖాళీ స్థలంలో పెంచుకోవచ్చు. చింత, గోరింట చెట్లు ఇంటి పరిసరాలలో ఉంటే దారిద్ర్యం మిమ్మల్ని వెంటాడుతుంది. వాటిని దూరంగా ఉంచితే మంచిది. చనిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచకండి. వాటి వలన దురదృష్టం పట్టుకుంటుంది. 
 
బాబుల్ చెట్లను కూడా ఇంట్లో పెంచకూడదు. పూజకు పనికొస్తుందని కొంత మంది పత్తి చెట్లను, సిల్కీ పత్తి చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతారు. ఇది చాలా తప్పు. మీ ఇంటి ఉత్తర దిశలో మరియు తూర్పు దిశలో మొక్కలు లేకుండా చూసుకోండి. పెద్ద పెద్ద వృక్షాలు ఇంటికి ఈశాన్య దిశలో ఉండకూడదు. అవి నెగిటివ్ ఎనర్జీని ప్రవేశింపజేస్తాయి. ఒకవేళ చెట్లు ఉంటే వెంటనే తొలగించండి.