బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (14:54 IST)

హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో అర్జెంటీనా మ్యాచ్‌ రద్దు

ఫిఫా వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా, శనివారం ఇజ్రాయెల్ అర్జెంటీనా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దు అయింది. పాలస్తీనా అనుకూల వర్గాల హెచ్చరికలు నిరసనల కారణంగా ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు.

ఫిఫా వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా, శనివారం ఇజ్రాయెల్ అర్జెంటీనా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దు అయింది. పాలస్తీనా అనుకూల వర్గాల హెచ్చరికలు నిరసనల కారణంగా ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు.
 
ఇజ్రాయెల్‌లో అర్జెంటీనా జట్టు మ్యాచ్‌ ఆడితే దాడులు చేస్తామని, మెస్సీ పోస్టర్లకు, జెర్సీలను తగులబెడతామని నిరసనకారులు హెచ్చరించారు. అంతేకాకుండా ప్రపంచకప్‌ కోసం అర్జెంటీనా ఆటగాళ్లు సాధన చేస్తున్న బార్సిలోనాలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ముందు ఆ జట్టు జెర్సీకి ఎర్రరంగు పూస్తూ నిరసనకారులు ఆందోళన చేశారు. 
 
దీంతో జెరూసలేం వేదికగా శనివారం జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సంఘం తెలిపింది. 'సంఘం సరైన నిర్ణయమే తీసుకుంది. అన్నింటికన్నా ఆటగాళ్ల క్షేమం ముఖ్యం. కాబట్టి ఇజ్రాయెల్‌తో మ్యాచ్‌ ఆడాలని మేం అనుకోవట్లేదు' అని అర్జెంటీనా స్ట్రైకర్‌ గోంజాలో వ్యాఖ్యానించారు.