శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (12:42 IST)

2019-20 బడ్జెట్- ఆదర్శ అద్దె.. సామాన్యులకు అందుబాటులోకి ఇళ్ల ధరలు-హైలైట్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంటులో గురువారం ప్రవేశపెడుతున్నారు. దేశంలో అన్నివర్గాల ప్రజలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని సీతారామన్ వెల్లడించారు. నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి  ఆదుకునేందుకు ఉదయ్‌ను తీసుకొచ్చామని చెప్పారు. 
 
విమానాల ఫైనాన్సింగ్ విషయంలో దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. అక్టోబరు 2 నాటికి ఓడీఎఫ్‌ భారత్‌గా తీర్చిదిద్దాలని ప్రధాని సంకల్పించామనియయ మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా దేశం ఇచ్చే కానుక ఇదేనని సీతారామన్ వెల్లడించారు. డిజిటల్‌ అంతరాలను తొలగించే డిజిటల్‌ లిటరసీ కార్యక్రమం. నగరాలు, పట్టణాలు, గ్రామాలను టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నామని ప్రకటించారు.  
 
ఇంకా 2019-20 బడ్జెట్ హైలైట్స్‌ను ఓసారి పరిశీలిస్తే.. 
లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా పెంచేందుకు నిర్ణయం
ఇందుకోసం సెబీతో చర్చించిన కేంద్రం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయాలని సూచన
సెబీ పర్యవేక్షణలో సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఏర్పాటు
 
సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుబడులు(ఈక్విటీ, అప్పు, మ్యూచువల్ ఫండ్) సమీకరించేలా త్వరలో నిబంధనలు
దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం
 
విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు
జల్ వికాస్ మార్గ్ పథకం ద్వారా అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యత
3 కోట్ల మంది రిటైల్ వర్తకులకు పెన్షన్ కోసం ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం
ఏటా వార్షికాదాయం రూ.1.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు ఇందుకు అర్హులు
 
ఈ పథకం కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ ఉంటే చాలు
ఖేల్‌ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రోత్సాహం
 
జాతీయ పరిశోధనా మండలి కింద ఎన్నికైన పరిశోధనలకు ఆర్థిక సాయం
జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు. పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు
 
81లక్షల గృహాలను ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథక కింద నిర్మించాం
ఇళ్ల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఆదర్శ అద్దె విధానం త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు.