మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (16:37 IST)

కుందేళ్ళకు చెవులు ఎందుకు పొడవుగా ఉంటాయి?

సాధారణంగా పిల్లులు, కుక్కలు, తోడేళ్లు, నక్కలు వంటి వాటితో పోల్చితో కుందేళ్ళకు చెవులు చాలా పొడవుగా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం. నిజానికి కుందేలు చాలా బలహీనమైన జంతువు మాత్రమే కాదు పిరికిది కూడా. దీంతో ప్రకృతి ప్రతి జీవికి వాటి స్వీయ సంరక్షణకు కల్పించినట్టే కుందేలుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. ఇందులోభాగంగానే కుందేలుకు చెవులు పొడవుగా సృష్టించింది. 
 
ఈ చెవుల ద్వారా అడవిలోని ఇతర జంతువుల అలికిడిని సులభంగా పసిగట్టి... ప్రాణాలను రక్షించుకునేందుకు బొరియల్లోకి వెళ్లిపోతుంది. అలాగే, తమ ఎముకల గట్టిదనానికి అవసరమైన 'విటమిన్ డి' ను ఈ చెవులు స్రవించే ఒక విధమైన తైలాన్ని గ్రహిస్తాయి. అది ఎలాగంటే.. తమ ముందరకాళ్ళతో పట్టుకుని నోటి దగ్గరకు తెచ్చుకుని తరుచూ వాటిని నాకి శుభ్రం చేస్తుంటాయి. దాని ద్వారా చెవుల నుంచి స్రవించే ఒకవిధమైన తైలాన్ని గ్రహిస్తాయి.