శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:43 IST)

మధుమేహాన్ని నియంత్రించే బార్లీ గింజలు...

బార్లీ గింజల వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది బార్లీ గింజలను పెద్దగా తీసుకోరు. కానీ ఈ గింజలలో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉండటం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో పీచు పదార్థాలు కూడా ఎక్కువే, మలబద్దకాన్ని ఇవి నివారిస్తాయి. జీర్ణాశయ ఆరోగ్యానికి బార్లీ చాలా మంచిది. 
 
బార్లీ గింజలు రక్తంలో చక్కెర మెల్లగా విడుదలయ్యేలా చేస్తాయి. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇవి తోడ్పడుతాయి. గుండెజబ్బులను, గుండెపోటును నివారిస్తాయి. 
 
బార్లీలో విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన కంటిచూపును దీర్ఘకాలం పాటు పదిలంగా ఉంచుతాయి. ఈ గింజల్లో ఉండే ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు చర్మానికి, వెంట్రుకలకు మెరుపునిస్తాయి. ఈ గింజల్లోని విటమిన్ బి, సి వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. బార్లీ గింజల్లోని ఐరన్ రక్తహీనతను నివారిస్తాయి. అంతేకాకుండా బార్లీలో ఉండే క్యాల్షియం, పాస్పరస్ ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తాయి.