బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (19:27 IST)

ఎదిగే పిల్లలకు శక్తినిచ్చే ఆహార పదార్థాలేంటంటే?

ఎదిగే పిల్లలకు శక్తినిచ్చే ఆహార పదార్థాల గురించి తప్పక తెలుసుకోవాలి. స్కూల్స్, స్పోర్ట్స్, ఇతరత్రా తరగతులకు పరుగులు పెట్టే పిల్లలకు పోషకాహారం ఇవ్వాలి. రాగి, మొక్కజొన్న, సజ్జలు, వేరు శెనగలు, పప్పు దినుసులన్నీ సమపాళ్ళలో హెల్త్ మిక్స్‌లో ఉండటం వల్ల పిల్లలకు గంజి అందించాలి. పిల్లలు హెల్తీగా ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా హెల్త్ మిక్స్‌ గంజి రోజూ తెల్లారు ఒక రెండు గ్లాసులు ఇవ్వడం మంచిది. 
 
పప్పు దినుసు, రాగి, సజ్జలు, మొక్కజొన్నలు నెలకు కావాల్సినంత పౌడర్‌లా చేసుకుని ప్రతిరోజూ గంజిలా కొంచెం పాలు కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా శరీరానికి కావాలసిన పోషకాలు లభిస్తాయి. 
 
ఇంకా ఈ పిండిలో కాస్త బెల్లం కలిపి స్నాక్స్‌లా కూడా పిల్లలకు పెట్టొచ్చు. మొక్కజొన్నలో విటమిన్లు, రాగిలో ఫాస్పరస్, కాల్షియం, పప్పు దినుసుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో బ్రేక్ ఫాస్ట్‌కు దీన్ని ఎంచుకోవచ్చు. 
 
సగ్గుబియ్యం, వేరుశెనగ, వేయించిన మినపప్పు, ఎర్రని బియ్యం, గోధుమ, రాగి, మొక్కజొన్న, బీన్స్, వరి, ఉద్దిబియ్యం, సజ్జలు, బాదం, జీడిపప్పు, పిస్తా, ఏలకులు వంటివి ఈ హెల్త్ మిక్స్‌లో కలుపుకోవచ్చు.