శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 10 మే 2021 (21:53 IST)

బాదములతో, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం వేడుక చేయండి

ప్రతి సంవత్సరం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. ఈ రోజున కుటుంబాల ప్రాధాన్యతను వేడుక చేయడంతో పాటుగా కుటుంబాలకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన మెరుగుపరచడం చేస్తారు. మనం తప్పనిసరిగా మన కుటుంబాన్ని వేడుక చేయడంతో పాటుగా అది మనకు ఎంత ముఖ్యమో కూడా వెల్లడించాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా, కుటుంబాలు మరియు వారి ప్రాధాన్యతలు నిరంతరం మారుతూనే ఉన్నాయి.
 
ఓ సమాజంగా, మనమంతా సంయుక్తంగా మనకెదురైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, వృద్ధి చెందుతున్న కమ్యూనిటీలో కుటుంబాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ప్రతి కుటుంబపు రోజువారీ కార్యక్రమాలను మహమ్మారి నిలుపుదల చేసింది. ఇంటిలోనే ఉండడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. పాఠశాలలు మూతపడ్డాయి. పనిప్రాంగణాలూ మూతపడ్డాయి. ఎంతోమంది తల్లిదండ్రులు మరియు కేర్‌ టేకర్లు తమ కుటుంబాలతో పాటుగా ఇంటిలోనే ఉండిపోయారు. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సర నేపథ్యాన్ని కుటుంబ సంక్షేమంపై నూతన సాంకేతికతల ప్రభావం అనే అంశంగా ఎంచుకున్నారు.
 
గత సంవత్సరం సాంకేతికత, ఓ వరదాయినిగా రావడంతో పాటుగా చేటుగానూ పరిణమించింది. అంతర్జాతీయంగా కుటుంబాలు మరియు స్నేహితుల నడుమ దూరాన్ని ఇది తగ్గించింది. అదే సమయంలో అతి వినియోగం మరియు అతిగా దానిపై ఆధారపడటం కూడా జరుగుతుంది. ఇది కుటుంబ సంక్షేమంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.
 
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ సందర్భంలో, మనమంతా కూడా మన కుటుంబాల ఆరోగ్యం, సంక్షేమం కోసం తోడ్పాటునందించాల్సిన ఆవశ్యకత ఉంది. దానితో పాటుగా స్వీయ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాల్సి ఉంది. దీనికోసం మన జీవనశైలిలో అతి చిన్నవే అయినప్పటికీ ప్రభావవంతమైన మార్పులు చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యం పరంగా మార్పులను తీసుకురావాల్సి ఉంది. ఇది ఆరంభించడానికి చక్కటి మార్గం సమాచారయుక్త ఆహార ప్రాధాన్యతలు తీసుకోవడం మరియు సరైన స్నాకింగ్‌ తీసుకోడం. బాదములు లాంటి గింజలలో 15 రకాల పోషకాలు అయినటువంటి విటమిన్‌ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, జింక్‌ మొదలైనవి ఉంటాయి. ఇవి గాక బాదములలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
 
సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ, ‘‘మన జీవితాలపై ప్రతి అంశంలోనూ కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం చూపుతుందనే అనుమానం ఉంది. ఈ మహమ్మారి ఎంతకాలం ఉంటుందనేది ఎవరికీ తెలియదు. కానీ ఓ తల్లిగా, నా కుటుంబ ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటుగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆరోగ్యవంతమైన ఆహారాలైనటువంటి బాదములను మీ స్వంత, మీ కుటుంబ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరంభించాలని తొలుత నేను సూచిస్తాను. 
డైట్‌కు పలు పోషకాలను ఇది అందించడంతో పాటుగా ప్రతి రోజూ బాదములు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే వీటిలో రాగి అధికంగా ఉండటంతో పాటుగా జింక్‌, ఫోలేట్‌, ఐరన్‌ కూడా అధికంగానే ఉంటుంది. అలాగే విటమిన్‌ ఈ కూడా బాదంలో అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతో పాటుగా ఊపిరితిత్తుల రోగ నిరోధక శక్తికి కూడా మద్దతునందిస్తుంది. వైరస్‌లు మరియు బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నివారించడంలో సైతం విటమిన్‌ ఈ తోడ్పడుతుంది.
 
ఇదేకాకుండా, ఈ కష్టకాలంలో, కుటుంబాలు ఏకతాటిపై ఉండటంతో పాటుగా శారీరక, బావోద్వేగ మరియు మానసిక మద్దతును ఒకరికి ఒకరు అందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి రోజూ కనీసం ఒక మీల్‌ అయినా అందరూ కలిసి తినడంతో పాటుగా స్కూల్‌, కాలేజీ లేదంటే మరేదైనా చోట జరిగిన అంశాలను పంచుకుంటూ ఉంటే బంధం కూడా బలోపేతం అవుతుంది, ఒకరి ఆరోగ్యంపై మరొకరు శ్రద్ధ చూపడమూ సాధ్యమవుతుంది’’ అని అన్నారు.
 
న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘నేటి రద్దీ జీవనశైలిలో కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన ఆవశ్యకత ఉంది. సౌకర్యవంతమైనప్పటికీ, ఆరోగ్యవంతమైన అంశమేమిటంటే కుటుంబ రోజువారీ ఆహారంలో బాదములను భాగం చేసుకోవడం. ఇది కుటుంబ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, బాదములతో ఆరోగ్యవంతమైన బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను సైతం నిర్వహించవచ్చు’’ అని అన్నారు.
 
ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌, సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ, ‘‘నా కుటుంబ ఆరోగ్యం నాకు ఎప్పుడూ తొలి ప్రాధాన్యతగానే ఉంటుంది. మన జీవితాలు ఎంత ఖాళీ లేకుండా తయారైనా, ఫిట్‌నెస్‌ మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలిపై ఎన్నడూ రాజీపడకూడదు. మరీ ముఖ్యంగా మన పిల్లలకు, ఇప్పుడు నిబంధనలుఅడ్డుగా ఉండటం వల్ల ఆరు బయట ఆడుకునే అవకాశం లేదు. ప్రాసెస్డ్‌ లేదంటే నూనె కలిగిన వస్తువులను తినడమూ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది.
 
ఈ తరహా ఆహారం తీసుకోవడం వల్ల వారి బరువు పరంగా మార్పులు చోటు చేసుకోవడానికీ, దీర్ఘకాలంలో వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులుగా పిల్లల ఆహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బాదములు లాంటి గింజలు అనారోగ్యకరమైన స్నాక్స్‌ను చక్కగా ఇవి భర్తీ చేస్తాయి. ఇవి పిల్లలు తిన్నప్పుడు కడుపునిండిందన్న భావన కలిగించడం వల్ల పిల్లలు అనారోగ్యకరమైన స్నాక్స్‌ వైపు దృష్టి సారించరు’’ అని అన్నారు. ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ వేళ, బాదములతో ఆరోగ్యంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూనే కలిసి ఉండటంలోని ఆనందాన్ని వేడుక చేసుకోండి.