సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (17:47 IST)

బాదముల యొక్క చక్కదనంతో రంగుల పండుగ హోలీని వేడుక చేసుకోండి

చక్కటి రుచులు, కుటుంబ సభ్యుల కలయికలు, బహుమతుల మార్పిడి మరియు రంగులతో కేళి- హోలీ వేళ ఇంతకుమించిన ఆనందం ఏముంటుంది? ప్రియమైన వారితో బహుమతులు పంచుకోవడానికి ప్రత్యేకమైన సందర్భం ఏమీ అవసరం లేకపోవచ్చు కానీ రంగుల పండుగ హోలీ మాత్రం ఆహ్లాదకరమైన, ఆలోచనాత్మకమైన, సంతోషకరమైన బహుమతులను ఎంచుకోవడానికి స్ఫూర్తిని అందిస్తుంది. మనం ఈ పండుగను ఏ విధంగా వేడుక చేసుకుంటున్నాం మరియు మన ప్రియమైన వారికి ఏమి బహుమతిగా అందిస్తున్నామనే అంశమై మనం ఖచ్చితంగా ఆప్రమత్తంగా ఉండాలి.
 
ఈ సంవత్సరం, ఎప్పటిలాగానే హోలీని వేడుక చేసుకోవడం ఆపేయండి. నీటి ఆధారిత రంగులు, వాటర్‌ బెలూన్స్‌ విసురుకోవడం ఆపేయండి. ఆర్గానిక్‌ రంగులను ఎంచుకోండి, అతి తక్కువగా వ్యర్థం చేయండి, అదే రీతిలో ప్రియమైన వారికి ఆరోగ్యవంతమైన మరియు పోషక విలువలను బహుమతిగా అందించండి. కుటుంబ కలయికలు పరిమితంగా మాత్రమే గాక తక్కువ సంఖ్యలో ఉండాల్సిన ఆవశ్యకత ఉన్న వేళ, వారిని కలిసేటప్పుడు, హోలీ వేళ తరచుగా తీసుకువెళ్లే గుజియాలకు బదులుగా రుచికరమైన బాదములను తీసుకువెళ్లండి. చక్కటి ఆరోగ్యపు బహుమతిగా బాదములు చిపరిచితం. స్నేహితులు, కుటుంబసభ్యులు, ప్రియమైన వారికి బహుమతిగా అందించడానికి అత్యుత్తమ బహుమతి ఇది.
 
సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ, ‘‘హోలీ నా ప్రీతిపాత్రమైన పండుగలలో ఒకటి. ఈ సంవత్సరం నిశ్శబ్దమైన, సురక్షితమైన, భౌతిక దూరం ఆచరించేలా పండుగను స్నేహితులు, కుటుంబసభ్యులతో చేసుకోబోతున్నాను. వ్యక్తిగతంగా, నాకు హోలీ అంటే అర్థవంతమైన బహుమతులను పంచుకునేందుకు ఓ చక్కటి సందర్భం. ఈ సంవత్సరం బాదములను దీనికోసం ఎంచుకుంటున్నాను. మా ఇంటిలో అందుబాటులో ఎప్పుడూ బాదములు ఉంటాయి. అవి సౌకర్యవంతమైన, రుచికరమైన, ఆకలి తీర్చే స్నాక్‌గా నిలుస్తాయి. దీనికి తోడు, తరచుగా బాదములు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటం, బరువు నియంత్రణలో ఉండటం, మధుమేహ నియంత్రణ, చర్మ ఆరోగ్యం మెరుగుపడటం కూడా జరుగుతుంది..’’ అని అన్నారు.
 
సుప్రసిద్ధ ఫిట్‌నెస్‌ మరియుసెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌, యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ, ‘‘హోలీ వేడుకలంటేనే, నృత్యం మరియు వినోదంతో కూడిన వేడుక. రంగులలో మీరు లీనమయ్యే ముందు, తగినంతగా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడంతో పాటుగా ఓ గుప్పెడు బాదములను సైతం తీసుకోండి. ఈ బాదములు తగిన శక్తిని అందించడంతో పాటుగా పండుగను ఆస్వాదించేందుకు తగిన శక్తినీ అందిస్తుంది’’ అని అన్నారు.
 
షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘భారతీయ పండుగలు ఏవైనా బహుమతులను పంచుకోవడం ఓ ఆచారంగా ఎన్నో తరాలుగా వస్తుంది. కానీ ఆధునిక జీవనశైలి పట్ల ఆకర్షితులవుతున్న వేళ, మనం అందించే బహుమతులలో, మన ఆలోచనలలో సైతం ఆ నవ్యత కనిపించాలి. ప్రధాన స్రవంతి బహుమతులకు బదులుగా ఆ బహుమతులను అందుకునేవారి ఆరోగ్యంను కాపాడే బహుమతులను అందుకోండి.
 
గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు చక్కటి ప్రాధాన్యతా బహుమతిగా బాదములు నిలుస్తాయి. లండన్‌లోని కింగ్స్‌ కాలేజీలో  నిర్వహించిన ఓ అధ్యయనంలో సీవీడీ ప్రమాదాలు అధికంగా కలిగిన వారు ప్రతిరోజూ బాదములు తీసుకుంటే ధమనులలో ఎండోథిలియల్‌ ఫంక్షన్‌ మెరుగుపడుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఈ రెండు కూడా గుండె ఆరోగ్యానికి చక్కటి సూచికలు. అందువల్ల ఈ హోలీ వేళచక్కటి ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వండి’’ అని అన్నారు.
 
అందువల్ల ఈ సంవత్సరం, బాదములను మీ ప్రియమైన వారికి బహుమతిగా అందించండి, చక్కటి ఆరోగ్యం దిశగా వారు చేసే ప్రయాణానికి తోడ్పాటునందించండి. పండుగ సంబరాలను జోడించుకునేందుకు మీరు ఈ సంవత్సరం తయారుచేసుకోతగ్గ ఓ రెసిపీ ఇదిగో...
బాదములు మరియు వైట్‌ చాక్లోట్‌ గుజియా (10 మందికి తగినట్లుగా)
కావాల్సిన పదార్థాలు:
పిండి ముద్ద కోసం గోధుమ పిండి- 2 కప్పులు, నెయ్యి- పావు కప్పు, నీరు- అరకప్పు, ఫిల్లింగ్‌ కోసం వైట్‌ చాక్లెట్‌- 1 కప్పు, కొబ్బరి తురుము- పావుకప్పు, యాలుకల పొడి- చిటికెడు, బాదములు- పావు కప్పు, బెల్లం- ఒక టేబుల్‌ స్పూన్‌.
 
తయారీ విధానం:
ముందుగా పిండిలో నెయ్యి, నీరు కలిపి మెత్తగా ముద్దలా చేసి ఓ అరగంట పక్కన ఉంచాలి.
 
ఓ గిన్నెలో చాక్లొట్‌ ఫ్లేక్స్‌, కొబ్బరి తురుము, బాదములు, బెల్లం కలపాలి.
 
ముందుగా కలుపుకున్న పిండిలో చిన్న ముద్ద తీసుకుని బాల్‌లా చేసి వాటిని రోటీల్లా ఒత్తాలి.
 
ఈ రోటీల మధ్యలో తయారుచేసుకున్న ఫిల్లింగ్‌ను కొద్దిగా ఉంచి రోటీని మూసేయాలి.
 
ఈ మూసిన గుజియా అంచులను కాస్త నీటితో తడిపితే అది శుభ్రంగా అంటుకుంటుంది. అర్థచంద్రాకారంలో వీటిని చేసుకుంటే అందంగా కూడా ఉంటుంది. ఆ ఆకృతి కోసం కట్టర్‌ వాడవచ్చు. నూనె లేదంటే నెయ్యి వేడి చేసి గుజియాలను గోధుమ రంగు వచ్చేలా వేయించుకోవాలి.