గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2024 (21:58 IST)

వేసవిలో శరీరానికి ఎనర్జీ బూస్టర్ కొబ్బరి నీరు, ఎలాగో తెలుసా?

కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తాయి.
చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు.
బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది.
మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు.
గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి.
అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.
జీర్ణక్రియ సజావుగా జరిగేందుకు కొబ్బరి నీరు సహాయం చేస్తాయి.
శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో కొబ్బరి నీరు సహాయపడవచ్చు.