శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ రేవిళ్ల
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:36 IST)

రోజూ కప్పు పెరుగు తింటే ఏమవుతుంది?

లావుగా ఉన్నవారు బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. కొందరు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. వైద్య చికిత్సలు చేయించుకోవడం, వ్యాయామం వంటివి చేస్తారు. పెరుగు తింటే పొట్ట పెరిగిపోతుందని దాన్ని ముట్టుకోరు. కానీ పెరుగు తింటే స్లిమ్‌గా తయారవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కప్పు పెరుగు తింటే సన్నగా అవుతారట. 
 
పెరుగులో ఉండే క్యాల్షియం కొవ్వును తగ్గించి స్లిమ్‌గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ప్రొటీన్‌ల వలన శరీరానికి మంచి పోషణ అందుతుంది. పెరుగును తీసుకుంటే స్నాక్స్ కూడా తక్కువగా తినాలనిపిస్తుందని చెబుతున్నారు. 
 
చిరుతిండ్లు తినడం వల్ల శరీరంలో క్రొవ్వు బాగా పెరుగుతుంది. ఊబకాయం, పొట్ట వస్తుంది. కాబట్టి రోజూ డైట్‌లో పెరుగు చేర్చుకుంటే చాలా మంచిది. 300 గ్రాముల పెరుగులో 200 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది.