ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (20:21 IST)

మునగ ఆకులలో ఎన్ని పోషకాలు వున్నాయో తెలుసా?

Drumstick Leaves
మునగాకు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు మునగ పూలు, మునగ కాయలు ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. మునగాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మునగాకు రసం నేత్ర రోగాలను, వాత, పైత్య దోషాలను, విషాలను హరిస్తుంది.
మునగాకు సూప్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ వారానికి ఒకట్రెండు సార్లు కంటే మించి తాగరాదు.
మునగాకు సూప్ ఉదయాన్నే పరగడుపున ఎట్టి పరిస్థితుల్లో తాగరాదు.
లేత మునగ ఆకు కూర వండుకుని తింటుంటే పురుషులకు శక్తినిస్తుంది.
మునగ కాయలు, ఆకులు కూరగా చేసుకుని తింటే స్త్రీలకు శరీరంలో చెడునీరు తొలగుతుంది.
మునగ ఆకు రసాన్ని గర్భిణీ స్త్రీలు, పిల్లలు తాగరాదు.
మునగాకు, వసకొమ్ము, వాము సమంగా కలిపి దంచి నూనెలో ఉడకబెట్టి గాయాలకు, దెబ్బలకు కడితే మానుతాయి.