శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 28 జులై 2018 (14:07 IST)

లిచి పండ్లలో ఎన్ని ప్రయోజనాలో.....

లిచి పండ్లు ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. ఇవి ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పండ్లను చైనాలోనే ఎక్కువగా పండిస్తుంటారు. ఈ లిచి పండ్లను తీసుకోవడం వలన ఎలాంటి లాభాలున్నాయో తెలుస

లిచి పండ్లు ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. ఇవి ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పండ్లను చైనాలోనే ఎక్కువగా పండిస్తుంటారు. ఈ లిచి పండ్లను తీసుకోవడం వలన ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.
 
లిచి పండ్లను తీసుకోవడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. తెల్ల రక్తకాణాల పనితీరును మెరుగుపరుస్తుంది. దీని వలన శరీరంలోని బ్యాక్టీరియాలు, వైరస్‌లు నాశనమవుతాయి. ఈ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ లిచి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన హైబీపీని అదుపులో ఉంచుతుంది. 
 
రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే కాపర్, ఐరన్‌లు శరీరంలోని ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుటలో సహాయపడుతాయి. శరీరంలో కణాలకు ఆక్సిజన్ అధికంగా లభించేలా చేస్తాయి. ముడతులు చర్మాన్ని తగ్గించుటలో లిచి పండ్లు ఎంతగానో దోహదపడుతాయి. 
 
వీటిని తీసుకోవడం వలన విటమిన్ సి చర్మంపై ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీని ఫలితంగా చర్మం యవ్వనంగా ఉంటుంది. ముడతలు రాకుండా ఉంటాయి. ఈ పండ్లలో మెగ్నిషియం, కాపర్, పాస్పరస్, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఎముకల బలానికి దృఢత్వాన్నిస్తాయి. ఈ లిచి పండ్లలో ఫైబర్ కొవ్వును కరిగించే శక్తి ఉంది.