గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (11:51 IST)

యోగాతో శరీర అవయవాలకు ముప్పు?

ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో మంచిదని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే భారత్‌లో యోగాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. యోగా వల్లే కలిగే ప్రయోజనాలను గ్రహించిన ఐక్యరాజ్య సమితి కూడా జూన్ 21వ తేదీన ప

ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో మంచిదని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే భారత్‌లో యోగాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. యోగా వల్లే కలిగే ప్రయోజనాలను గ్రహించిన ఐక్యరాజ్య సమితి కూడా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. యోగావల్ల శరీర అవయవాలకు, ముఖ్యంగా చేతులకు ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. యోగా చేస్తున్న 10 మందిలో ఒకరికన్నా ఎక్కువ మందికి ‘మస్క్యులోస్కెలెటల్‌’ పెయిన్స్‌ అంటే కండస్థ ఎముకలకు సంబంధించిన నొప్పులు వస్తాయని వెల్లడైంది. 
 
యోగా వల్ల భుజాలు, మోచేతులు, ముంచేతులకు నొప్పులు వస్తాయని, కొన్ని సార్లు కాళ్లకు కూడా నొప్పులు వస్తాయని ఈ పరిశోధన చెపుతోంది. ఇతర క్రీడల వల్ల శరీరానికి ఎలా గాయాలయ్యే అవకాశం ఉందో, యోగా వల్ల కండరాలకు గాయాలయ్యే అవకాశం ఉందట. యోగా వల్ల తాము ఇంతకుముందు అంచనా వేసిన ముప్పు కంటే ఇప్పుడు ముప్పు పదింతలు ఎక్కువని స్పష్టమైందని ఆయన వెల్లడించారు. 
 
ఈ పరిశోధనా వివరాలను ‘బాడీ వర్క్‌ అండ్‌ మూవ్‌మెంట్‌ థెరపీస్‌’ అనే పుస్తకంలో ప్రచురించారు. న్యూయార్క్‌లో రెండు వేర్వేరు యోగా క్లాసులకు హాజరవుతున్న 350 మందిపై అధ్యయనం జరపడం ద్వారా ఈ వివరాలను సేకరించినట్లు ఆయన చెప్పారు. వారిలో మొత్తం 26 శాతం మంది యోగాభ్యాసకులు సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు.