బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:45 IST)

మైగ్రేన్‌ తలనొప్పి ... జాగ్రత్తలు

తలనొప్పుల కారణాలు లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. అవి...
1) ప్రైమరీ_తలనొప్పులు.. ఈ తరహా తలనొప్పులు నేరుగా తలలోనే ఉద్భవిస్తాయి. ఈ నొప్పులకు కారణం తలలోనే ఉంటుంది.
2)సెకండరీ_తలనొప్పులు... ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతో వస్తుంటాయి. అంటే... తలలో గడ్డలు ఏర్పడటం, తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు వస్తాయి. కాబట్టే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు.
3)  క్రేనియల్‌_న్యూరాల్జియా లేదా ఫేషియల్‌ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు... (తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్‌ నర్వ్స్‌ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.
 
కారణాలివి:
మైగ్రేన్‌కు చాలా కారణాలు ఉంటాయి. తీవ్రమైన యాంగై్జటీ, ఒత్తిడి, సరిపడని పదార్థాలు తినడం (ఉదాహరణకు చాక్లెటు, చీజ్, వెన్న, సోయా సాస్, కాఫీలోని కెఫిన్, ప్రాసెస్‌ చేసిన మాంసాహార పదార్థాలు, నిమ్మ జాతి పండ్లు వంటివి. ఇవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు).

తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితో ఉండటం, తీవ్రమైన శారీరక శ్రమ, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరుబత్తీలు, కొన్ని రసాయనాలతో చేసిన సెంట్ల నుంచి వచ్చే ఘాటైన వాసనలు, ఆల్కహాల్‌ (అందులోనూ ముఖ్యంగా రెడ్‌వైన్‌), చైనీస్‌ ఫుడ్‌ ఐటమ్స్, యువతుల్లో హార్మోన్ల మార్పులు, తలస్నానం చేస్తూనే తలకు బిగుతుగా ఉండే హెయిర్‌ బ్యాండ్‌ ధరించడం, ఎండకు ఒకేసారి ఎక్స్‌పోజ్‌ కావడం, మలబద్దకం వంటి అంశాలు మైగ్రేన్‌ తలనొప్పిని ప్రేరేపించి బాధను తీవ్రతరం చేస్తాయి.*
 
ఈ మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్‌లకు ఇటీవల బొటాక్స్‌ చికిత్స చేస్తున్నారు. పెప్పర్‌మెంట్‌ ఆయిల్, లావండర్‌ ఆయిల్‌ తలకు అప్లై చేసుకోవడంతో ఉపశమనం దొరుకుతుంది. మెగ్నీషియమ్, రైబోఫ్లేవిన్‌ (బి2 విటమిన్‌) అధికంగా ఉన్న పదార్థాలు (గోధుమ వంటి ధాన్యాలు– పండ్లు, ఆకుకూరల్లో ఇవి అధికం) తీసుకోవడం ద్వారా కూడా ఉపశమనం దొరకుతుంది.
 
క్లస్టర్‌_హెడేక్‌ : ఇది కాస్త అరుదుగా కనిపించే తలనొప్పి. కంటి పాపల వెనక బాగా తీవ్రమైన నొప్పి వచ్చి, రెండు మూడు గంటలు బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికీ తిరగబెడుతూ కొద్దిరోజుల పాటు వస్తుంటుంది.  రోజూ ఒకే వేళకు వస్తుంటుంది. ఏడాదిలో 8–10 వారాల పాటు వస్తుంటుంది. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు రాదు. కానీ ఆ మరుసటి ఏడాది కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8–10 వారాల పాటు అదే వేళకు వస్తూ ఉంటుంది.
 
చికిత్స : దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్‌ను అందిస్తారు లేదా ట్రిప్టాన్‌ మందులను ముక్కుద్వారా పీల్చేలా చేసి మొదట  నొప్పిని తగ్గిస్తారు. దీర్ఘకాలికంగా ఈ తరహా తలనొప్పి రాకుండా చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రైమరీ కాఫ్‌ అండ్‌ లాఫ్‌ హెడేక్‌ : తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వంటి చర్యల వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్‌ ఆర్టరీ అనే మంచి రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావచ్చు. 
 
హిప్నిక్‌_హెడేక్‌ : నిద్రలోనే మొదలై నిద్రలేచాక కూడా దాదాపు 15–30 నిమిషాల పాటు ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్‌ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స.
 
గ్లకోమా_హెడేక్‌: కంటిగుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఇందులో తలనొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఇది నెమ్మదిగా చూపును హరించి వేస్తుంది. కాబట్టి తలనొప్పి కనిపించగానే డాక్టర్‌ను సంప్రదించాలి.  ఇవే గాక... సర్వైకల్‌ నర్వ్స్‌ ఒత్తిడికి లోనైనప్పుడు, పక్క మీద తలగడ సరిగా లేనప్పుడు కూడా తలనొప్పులు వస్తుంటాయి. ఇలా ఇతరత్రా కారణాలతో  వచ్చే తలనొప్పులు చాలా ఎక్కువగానే ఉన్నాయి.
 
సాధారణ_నివారణ:
తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి... ∙కంప్యూటర్‌ వర్క్‌ చేసే వారు కంటికి ఒత్తిడి కలగకుండా యాంటీ గ్లేయర్‌ గ్లాసెస్‌ ధరించాలి. అలాగే ప్రతి గంటకు ఒకసారి అయిదు నిమిషాల పాటు రిలాక్స్‌ అవాలి ∙పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్‌ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.

తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ∙రోజూ ప్రశాంతంగా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది.  

ఒకముఖ్యసూచన : కొంతమంది హైబీపీ వల్ల తలనొప్పి వస్తుందని అపోహ పడుతుంటారు. తలనొప్పి రావాలంటే బీపీ 210 / 110 ఉన్నప్పుడు మాత్రమే తలనొప్పి వస్తుంది. అప్పుడే ఇంత హైబీపీ తలనొప్పికి కారణమవుతుంది.