శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (15:59 IST)

డిప్రెషన్‌కు అసలు కారణాలివే...

చాలా మంది తీవ్రమైన ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతుంటారు. ఇలాంటి వారికి ఆత్మీయులు, అయినవారు, స్నేహితుల అండ చాలా ముఖ్యం. తీవ్రమైన ఒత్తిడిని మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఎంతో ముఖ్యం. 
 
బాధగా ఉండటం, ఆత్యన్యూనతకు లోనుకావడం, నిరాశ, నిస్పృహలతో రోజులు గడపడం, జీవితంపై నిరాసక్తత, చేసే పనులపై ఆసక్తి లేకపోవడం, ఒంటరిగా గడపాలని అనిపించడం... ఇలాంటి లక్షణాలున్నట్లయితే డిప్రెషన్‌లో ఉన్నారని గుర్తించాలి. అసలు డిప్రెషన్‌కు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 
 
* మనసులో ఎప్పుడూ ఆందోళన. 
* నిరాశ, నిస్పృహ, జీవితంపై నిరాసక్తత. 
* కోపం, బాధ, చిరాకు, చేసే పనిపై ఆసక్తి లేకపోవడం. 
* జీవితం అగమ్యగోచరంగా ఉండటం. 
* శరీరంలో శక్తి లేనట్లుగా ఉండటం. 
* ఆకలి లేకపోవడం, లేదంటే విపరీతంగా ఆకలేయడం. 
* ఏకాగ్రత లోపించడం, మతిమరుపు, నిద్రపట్టకపోవడం. 
* శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం. 
* ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం.