ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 15 నవంబరు 2023 (15:28 IST)

మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలలో అధిక పోషక విలువలు వుంటాయి. ఎందుకంటే మల్టీగ్రెయిన్ వివిధ ధాన్యాల కలయిక వల్ల పోషక శక్తిని అందిస్తుంది. మధుమేహాన్ని అదుపులో వుంచుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలను తింటుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి తింటుంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి.
 
ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో మల్టీగ్రెయిన్ వంటకం దోహదపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో కూడా ఇవి మేలు చేస్తాయి. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలను తింటుంటే ఎముకలు దృఢంగా వుంటాయి.
 
బరువు తగ్గేందుకు, నియంత్రణలో పెట్టుకునేందుకు మల్టీగ్రెయిన్ పదార్థాలు తీసుకుంటుండాలి.
తేలికగా జీర్ణమవడమే కాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా వుంచుతుంది.