బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (12:18 IST)

మెదడు పనితీరు కోసం మీరు ఏం చేస్తున్నారు?

Memory
Memory
వయసు పెరిగే కొద్దీ మన మెదడులో మార్పులు వస్తాయి. ఇవి మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. 
 
అయితే నేటి యువతలో చిన్న వయస్సులోనే జ్ఞాపకశక్తి కోల్పోవడం, మతిమరుపు అనేది సర్వసాధారణమైపోయింది. అందుకే మెదడు పనతీరును మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి పనులు  చేయాలో తెలుసుకుందాం. 
 
వ్యాయామం: ఏరోబిక్ వ్యాయామం చేయవచ్చు. అది మీ మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
 
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: గింజలు, సాల్మన్, తృణధాన్యాలు, ఆలివ్ నూనె వంటి గుండె-ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు, ఈ రకమైన ఆహారం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.
 
గుండె ఆరోగ్యం: అధిక రక్తపోటు ఉన్న మధ్య వయస్కుల్లో వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి క్షీణించడం సర్వసాధారణం. మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుని క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. 
 
బాగా నిద్రపోండి: జ్ఞాపకశక్తి, శ్రద్ధను ప్రభావితం చేసే ప్రధాన కారకాల్లో ఒకటి తగినంత నిద్ర. గాఢ నిద్ర జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. 
 
ధూమపానం మానేయండి: పొగాకు నుండి వచ్చే నికోటిన్ గుండె, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దీనిని మానుకోవడమే మంచిది. తద్వార గుండె, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారం అవుతాం.