సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 30 మార్చి 2019 (18:20 IST)

అసలే వేసవికాలం... భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా?

సాధారణంగా చాలా మందికి భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగడం అలవాటు ఉంటుంది. అలాగే, వేసవి కాలం వచ్చిందంటే కూడా చీటికి మాటికి చల్లని నీటినే తాగేందుకు ఇష్టపడుతారు. ఇందుకోసం ఫ్రిజ్‌లలో వాటర్ బాటిల్స్‌లలో నీటిని నింపి.... బాగా కూల్ అయ్యేంతవరకు ఉంచుతుంటారు. 
 
అయితే ఇలాంటి ఐస్ వాటర్ తాగడం చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారం ఆరగించిన వెంటనే చల్లని నీటిని సేవించడం వల్ల మనం తీసుకున్న ఆహారంలోని ఆయిల్ పదార్థాలను ఆ చల్లని నీరు గడ్డకట్టుకునేలా చేస్తాయని చెపుతున్నారు. 
 
దీనివల్ల ఆరగించిన ఆహారం జీర్ణం కాదని అంటున్నారు. అంతేకాకుండా, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కూడా అధిక శాతానికి పెంచుతాయట. ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే హృద్రోగ, మూత్ర సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హృద్రోగులు చల్లని నీటిని తాగరాదని కోరుతున్నారు.