గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 3 జూన్ 2022 (23:29 IST)

అరటి పండ్లు తింటే వచ్చే ప్రయోజనం ఏంటి?

అరటిపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది రక్తపోటును నిర్వహించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, మలబద్ధకం, అల్సర్ల సంబంధిత తీవ్రమైన సమస్యల నుండి బయటపడటంలో కూడా అరటి ఎంతో సహాయపడుతుంది.


శరీర ఉష్ణోగ్రతను కూడా అరటిపండు పూర్తిగా నియంత్రిస్తుంది. అరటిపండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. రక్తహీనతతో పోరాడటానికి సహాయపడుతుంది.

 
అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం మెదడును పూర్తిగా అప్రమత్తంగా ఉంచుతుంది. ఇది విటమిన్ B6 యొక్క అద్భుతమైన మూలం. నాడీ వ్యవస్థను పూర్తిగా బలపరుస్తుంది. జ్ఞాపకశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది.

 
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే, ఖచ్చితంగా ప్రతిరోజూ తినండి. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పూర్తిగా అభివృద్ధి చేస్తాయి. పొటాషియం, ఫైబర్, మెగ్నీషియంకు అరటి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అరటిపండు తినడం వల్ల ఎనర్జీ లెవెల్ బాగా పెరుగుతాయి.