మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (12:17 IST)

గోధుమ రొట్టెలు బరువును తగ్గిస్తాయా?

గోధుమ రొట్టెలు బరువును తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముడి బియ్యం కంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంసకృత్తులు, పీచు పదార్థాలు ఎక్కువగా వుంటాయి. కాస్త తినగానే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. అందుచేత ఆకలి వుండదు. 


అయితే రొట్టెలు, ముడి బియ్యం, కొర్ర బియ్యం… ఏదైనాసరే వాటితో పాటు తీసుకునే కూర, పప్పు పరిమాణాన్ని బట్టి కూడా బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి ధాన్యంలో దానికే ప్రత్యేకమైన కొన్ని పోషకాలు ఉంటాయి. 
 
కాబట్టి ఒకే ధాన్యపు వంటకాన్ని రోజూ తినకుండా, అన్ని రకాల ధాన్యాలనూ తీసుకోవాలి. దీంతో పాటు ఆకుకూరలు, కాయకూరలు ఎక్కువగా తినడం మంచిది. ఇంకా వెన్న తీసిన పాలు, పెరుగు వినియోగించాలని. దీంతో పాటు శారీరక వ్యాయామం చేయాలి. తగినంత నిద్రపోవాలని న్యూట్రీషియన్లు అంటున్నారు. 
 
ఇంకా ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. కాల్షియం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న క‌ణ‌జాలం కూడా ఉత్తేజంగా ప‌నిచేస్తుంది. పాలు, పెరుగు, ప‌నీర్‌, కోడిగుడ్లు, పాల‌కూర‌, క్యాబేజీ, కాలిఫ్ల‌వ‌ర్ త‌దిత‌రాల్లో కాల్షియం మ‌న‌కు పుష్క‌లంగా ల‌భిస్తుందని, ఎముకల బలంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.