బెంబేలెత్తిస్తున్న చైనాలో వింత జ్వరం, ఎలుకలు తిన్నవారికి...
కరోనావైరస్ చైనా నుంచి పుట్టింది. ఇది నేడు ప్రపంచాన్ని ఎంతలా కుదిపేస్తుందో తెలిసిన విషయమే. ఇప్పుడు మరోసారి చైనాలో వింత జ్వరం సోకి పలువురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, షాంఘై లోని వాయువ్య ప్రావిన్స్‌లో వింత జ్వరం కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఈ జ్వరం కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నివేదించింది. అయితే, ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి వాస్తవ సంఖ్యను ఇంకా నిర్ధారించబడలేదు. ఈ అంటు వ్యాధికి ప్రధాన మూలం ఎలుకలు లేదా వాటి తరహా జీవులు కావచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. ఎలుకలను ఆహారంగా తింటే వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.
ఎలుకల మలం లేదా మూత్రం తాకినట్లయితే వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. అలాగే, టీకా ద్వారా చికిత్స చేయవచ్చు. గత రెండు వారాలుగా చైనాలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు చెపుతున్నారు.