శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By మనీల
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2019 (10:11 IST)

పొటాటో చిప్స్‌తో కేన్సర్‌కు చెక్..

చిప్స్ అనగానే చెత్త ఆహారమనీ, అమ్మో ఫ్యాట్ పెరిగిపోతుందని... ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. అయితే బాగా వేయించిన బంగాళాదుంప చిప్స్ కొన్ని రకాల కేన్సర్‌లపై పోరాడగలదని శాస్త్రవేత్తరు చెబుతున్నారు.
 
ఈ చిప్స్‌లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందనీ, ఇది కేన్సర్ వృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రమాదకరమైన ఫ్రీ ర్యాడికల్స్‌ను అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
 
సీ విటమిన్ ఆహారం ఎక్కువగా తీసుకునే వారికి అన్నవాహికా, జీర్ణాశయ, రొమ్ము కేన్సర్‌ల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుందని ప్రముఖ పౌష్టికాహార నిపుణుడు ఫియోనా హంటర్ అంటున్నారు. అలాగే చిప్స్ తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని ఆయన వివరించాడు.