ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సందీప్
Last Modified: గురువారం, 18 ఏప్రియల్ 2019 (21:12 IST)

బర్రె పాలు - ఆవు పాలు... ఏవి మంచివి?

చాలా మంది చిక్కగా రుచిగా ఉండటం వలన బర్రె పాలనే ఇష్టపడతారు. బర్రె పాలలో వెన్న శాతం కూడా అధికంగానే ఉంటుంది. కానీ బర్రె పాల కంటే ఆవు పాలే శరీరానికి ఎంతో శ్రేష్టం అని చెబుతున్నారు నిపుణులు. 
 
ఆవు పాల వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆవు పాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అధిక బరువును నియంత్రించడంలో ఈ పాలు చాలా సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. 
 
ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తాగితే పైల్స్ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. పిల్లల ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఆవు పాలు చాలా ఉపయోగపడతాయి. ఆవు పాలలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. 
 
ఎముకల దృఢత్వానికి ఈ పాలు బాగా దోహదపడతాయి. కంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తిని  పెంచడంలో దివ్యౌషధంగా పనిచేస్తాయి. మెదడు చురుకుదనానికి ఇది మంచి ఔషధం.